
8వ షెడ్యూల్‌లో పొందుపర్చడం హర్షణీయం
నార్నూర్: బంజారా (లంబాడా) గోర్‌బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపర్చుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్‌త్ చౌహాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి మాట్లాడారు. బంజారా గిరిజనుల ప్రత్యేకమైన వేషాధారణ, భాష ఉన్నప్పటికీ లిపి లేక పోవడంతో గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో కళాకారు ల సంఘం జిల్లా అధ్యక్షుడు అడే డిగాంబర్, ఉట్నూర్ నాయక్ గంగారాం నాయక్, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.