నిర్మల్‌చైన్‌గేట్: రైతులపై పంజాబ్ ప్రభుత్వం, పోలీ సుల దాడి చేయడం హేయమైన చర్య అని సంయు క్త కిసాన్ మోర్చా నాయకులు పేర్కొన్నారు. పంజాబ్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా శుక్రవారం ఆర్డీవో కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నూతన్‌కుమార్, జే రాజు మాట్లాడారు. మోదీ పాలనలో దేశంలో రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. పదేళ్లలో కేంద్రంలో మో దీ ప్రభుత్వం రూ.16లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల ను మాఫీ చేసిందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా రైతు రుణాన్ని మాఫీ చేయలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు డాకూర్ తిరుప తి, నాగెళ్లి నర్సయ్య, శంభు, గోనె స్వామి, గుట్ల ప్రసాద్, మంక శ్రీనివాస్, రాములు పాల్గొన్నారు.