
సాగునీరు అందించాలి
కడెం: కడెం, సదర్‌మాట్ చివరి ఆయకట్టు వర కు సాగునీరు అందించాలని బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. మండలంలోని మొ ర్రిగూడం, చిన్నబెల్లాల, పెద్దబెల్లాల, పెద్దూర్ తండా, చిట్యాల, కొత్త మద్దిపడగ, లక్ష్మీసాగర్ గ్రామాల్లోని పంటలకు మరో రెండు తడులకు సాగునీరు అందించాలని కోరారు. వరి పంట పొట్ట దశలో ఉండగా సాగునీరు అందక పొలా లు ఎండిపోతున్నాయని తెలిపారు. చెరువులు, కుంటలు నింపి సాగునీరు ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌ను కలిసినవారిలో రైతులు వెంకటేశ్, మల్లేశ్, రాజేశ్వర్, శ్రీనివాస్, సత్తన్న, గంగన్న, హనుమాండ్లు, చిన్న రాజం, నర్సయ్య, లింగన్న, లచ్చన్న, రవి, తిరుపతి, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్, ఉపేందర్ తదితరులున్నారు.