
డిప్లొమాతో ఉజ్వల భవిష్యత్తు
● ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 13న ప్రవేశ పరీక్ష
పరీక్ష వివరాలు
దరఖాస్తు: polycet. sbtet. telangana. gov. inలో అందుబాటులో ఉంది.
చివరి తేదీ: ఏప్రిల్ 19, 2025 (ఫీజు లేకుండా); ఏప్రిల్ 23, 2025 (రూ.300 ఆలస్య రుసుముతో).
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్, 2.5 గంటలు, 150 ప్రశ్నలు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ).
పరీక్ష తేదీ : మే 13, 2025.
లక్ష్మణచాంద: తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పాలిసెట్) 2025 మే 13న జరుగనుంది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరా లనుకునే విద్యార్థులకు ఈ పరీక్ష కీలకమని నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, ఉట్నూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్న రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా పూర్తి చేసినవారు ఇంజినీరింగ్ డిగ్రీలో రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చని తెలిపారు. సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.