
‘అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే..’
నిర్మల్‌చైన్‌గేట్: అంబేడ్కను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్సేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో బుధవారం సెమినార్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేడ్కర్‌కు చరిత్రలో స ముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందని తెలిపా రు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు, దళిత గిరిజన బిడ్డలకు రాష్ట్రపతి పదవులు దక్కేలా చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, మహిళలకు కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు కల్పించి అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తోందని చెప్పారు. నాయకులు భస్వపురం లక్ష్మీనర్సయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, రాచకొండ సాగర్, అలివేలు మంగ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.