
ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: పోలీసులు ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల స్థితిగతులను పోలీస్ స్టేషన్‌వారీగా సమీక్షించి, గంజాయి, రౌడీ షీట్లు, ఎస్సీ/ఎస్టీ, పోక్సో, మహిళలపై నేరాల కేసులను వీలైనంత త్వరగా పూ ర్తి చేయాలన్నారు. అవసరమైతే న్యాయమూర్తులను కలిసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఏఎస్పీలు, సీఐలు గ్రామాలను సందర్శించి, నైట్ పెట్రోలింగ్‌తో నేరాల సమాచారం ముందస్తుగా సేకరించాలని తెలిపారు. గంజాయి రవాణా, బెట్టింగ్ యాప్‌ల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు స్పెషల్ టీమ్‌లు, సీసీ కెమెరాలతో నిఘా బలోపేతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద హాట్‌స్పాట్‌లలో మార్పులు, డ్రంక్‌అండ్‌డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, సీఐలు ప్రవీణ్‌కుమార్, గోపీనాథ్, గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ సీఎమ్మార్ చెల్లించాలి
భైంసాటౌన్: ఆయా సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎమ్మార్ బకాయిలు మిల్లర్లు త్వరగా చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి డివిజన్ పరిధిలోని రైస్‌మిల్లర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. గత సీజన్లకు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన ధాన్యం మరాడించి, బియ్యం అప్పగించాలన్నారు. అప్పగించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. రికార్డు రూం, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి డీసీఎస్‌వో, ఆర్డీవో కోమల్‌రెడ్డి, సివిల్ సస్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.