
ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 374 విద్యార్థులకు 275 మంది హాజరు కాగా 99మంది గైరాజరయ్యారు. ఏ డోతరగతి నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించిన ప్రవేశ పరీ క్షకు 216 మందికి 136 మంది హాజరుకాగా 80 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్ న వీన్‌కుమార్, డీవో మహేందర్ తెలిపారు. పరీ క్షాకేంద్రాన్ని డీఈవో రామారావు తనిఖీ చేశా రు. పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.