బీజేపీ సంబరాలు..
సుభాష్‌నగర్: రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలంగాణలో కూడా పడుతుందని, అవే ఫలితాలు పునరావృతం అవుతా యని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంపై బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి మిఠాయి లు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహారాష్ట్ర ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి కుర్చీ భయం పట్టు కుందన్నారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉంటుందని, కాంగ్రెస్ గ్యారెంటీల మోసానికి మరా ఠ ప్రజలు తగిన బుద్ధిచెప్పారని ఎద్దేవాచేశారు. ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని కాంగ్రెస్ ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ కూటమి గెలవలేదన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు చేయకపోతే వచ్చే స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మరఠ్వాడ ప్రజలు నమ్మి మరోసారి డబుల్ ఇంజన్ సర్కారును కోరుకున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప థకాలు, ఆ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, పథకాల అమలు వల్లే మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, కార్పొరేటర్లు, నాయకులు స్రవంతిరెడ్డి, స్వామి యాదవ్, సంతోష్, కర్క గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, పానుగంటి సతీష్‌రెడ్డి, కిషోర్, చుక్క మధు, నక్క రాజేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment