మార్కెట్‌యార్డులో ఉద్రిక్తత
సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్‌లో పసుపు దొంగతనాలకు తమల్ని బాధ్యులను చేస్తున్నారని ఆరోపిస్తూ చాటా, ముల్లే, హమాలీ, దడువాయి, మునీమ్‌లు శనివారం ఉద యం నుంచే గంజ్‌లోని క్షేత్రస్థాయి సిబ్బంది కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న చైర్మన్ ముప్ప గంగారెడ్డి మార్కెట్ కమిటీకి చేరుకుని యూనియన్ల ప్రతినిధులు, కొంత మంది కార్మికులతో చైర్మన్ తన కార్యాలయంలో సమావేశమై చర్చించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చైర్మన్ విజ్ఞప్తిచేయగా, ఆందోళన విరమించేందుకు వారు ఒప్పుకున్నారు.
భద్రతాసిబ్బందిపై దాడి
ఆందోళన చేస్తున్న కార్మికులతో మాట్లాడేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది కార్యాలయం వద్దకు యూనియన్ ప్రతినిధులతో కలిసి చైర్మన్ ముప్ప గంగారెడ్డి చేరుకున్నారు.
అప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్న వారు మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు చైర్మన్ కారు వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో.. ఆయన వెనుదిరిగారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, శ్రావణ్‌పై కొంత మంది దాడికి తెగబడ్డారు. వారిని పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా, వాహనాన్ని అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాడి విషయం తెలు సుకున్న సీఐ, మూడో టౌన్ ఎస్సై అక్కడికి చేరుకు ని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పలువురిపై కేసు నమోదు
ఖలీల్‌వాడి: మార్కెట్ యార్డులో పోలీసుల వా హనం అద్దాలు ధ్వంసం చేసిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబు తెలిపారు. మరికొందరిని గుర్తించామని వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నా రు. తమపై దాడి జరిగిందని సెక్యూరిటీ గార్డులు శ్రీనివాస్, శ్రావణ్ ఫిర్యాదు చేయగా, పలువురు హమాలీలపై కేసు నమోదు చేశామన్నారు.
సెక్యూరిటీ సిబ్బందిపై దాడి..
ఆందోళనతో మూడు గంటలపాటు
నిలిచిన కొనుగోళ్లు
యథావిధిగా కొనుగోళ్లు
మార్కెట్‌యార్డులో కార్మికుల ఆందోళనతో మూడు గంటలపాటు క్రయావిక్రయాలు నిలిచిపోయాయి. ఆందోళన విరమించిన వెంటనే కొనుగోళ్లు యథావిధిగా చేపట్టారు. ఆందోళన కారణంగా ఆలస్యం కావడంతో ఈ–నామ్‌లో ధర కోడ్ చేయడానికి కొనుగోలుదారులకు సమయంలో వెసులుబాటు కల్పించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత పసుపు క్రయవిక్రయాలు సాఫీగా జరిగినట్లు మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. 6 వేల క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలు జరిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment