శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
నిజామాబాద్ రూరల్: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని శబ్ధ తరంగిణి సంస్థ అధ్యక్షుడు సేర్ల దయానంద్ అన్నారు. నగరంలోని సరస్వతినగర్‌లో సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం శివాజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ భవానీ మాతకు భక్తుడని అన్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా శ్రీగోరక్షక సమితి సభ్యుడు ధాత్రిక రమేశ్ మాట్లాడుతూ.. ముస్లిముల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో ప్రకాశ్‌గౌడ్, మహేశ్, గడ్డం ధీరేందర్‌రెడ్డి, తొగర్ల సురేశ్, సంతోష్, బాబురావు, ఆడెపు లింబాద్రి, శ్రావణ్‌కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment