బోధన్: బోధన్‌లోని ఆజాంగంజ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎడపల్లి మహా త్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య, మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ ఉన్న విద్యార్థుల తరగతి గదికి వెళ్లిన కలెక్ట ర్ వారితో భేటీ అయ్యారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా విద్యా ర్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌లను పరిశీలించారు. పాఠశాల భవనంలో కలియతిరిగి తరగతి గదులు, కిచెన్ రూం, డైనింగ్ హాల్‌ను, స్టోర్ రూంలో నిల్వ ఉంచిన వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల తో కలిసి కలెక్టర్ పాఠశాలలో నిద్రించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, తహసీల్దార్ విఠల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment