ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ నాగారం: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డాక్టర్ శ్రీశైలం సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌రోడ్‌లో ఉన్న నలంద పాఠశాలలో పిల్లల వైద్యుల సంఘం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్ర త, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సద స్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన డాక్టర్ శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించి వాహనాలను నడపాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దని అలా చేస్తే ప్ర మాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు రోడ్డు భద్రత నియమాలను వివరించాలని సూచించారు. అంతేకాకుండా విద్యు త్ ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్యక రమైన జీవితం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సొసైటీ వారు రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కరిపె రవీందర్, మురళి కృష్ణ, ఇంగు నేహ, తనూజ, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment