నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరం
మోపాల్: శివాజీ మహరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారులోని బోర్గాం(పి) ప్రధాన చౌరస్తాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం బుధవారం ఉదయం 9 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హాజరుకానున్నారు.
ఖానాపూర్‌లో
ఉచిత ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ రూరల్: ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్‌లో మంగళవారం సన్‌రైజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు ఆస్పత్రి సిబ్బంది ఉచితంగా బీపీ, షుగర్, పలు టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, బీజేవైఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న
సెల్‌ఫోన్ల అందజేత
ఖలీల్‌వాడి: నగరంలోని రెండోటౌన్ పీస్‌లో సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తొమ్మిది మంది బాధితులకు టౌన్ సీఐ రాజశేఖర్‌రాజు మంగళవారం ఫోన్లను అందజేశారు. ఫోన్ పోయిన వారు వెంటనే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమలో ఎస్సై యాసిన్ అరాఫత్, కానిస్టేబుల్ రాములు పాల్గొన్నారు.
బాలికలు చదువును మధ్యలో ఆపొద్దు
డొంకేశ్వర్(ఆర్మూర్): బాలికలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే చదువును మాత్రం ఆపకూడదని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. అక్షరాస్యత, లింగ సమానత్వం, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్ అన్నపూర్ణ, పుష్ప, జమ్రు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరం
Comments
Please login to add a commentAdd a comment