ఎస్సారెస్పీ సగం ఖాళీ!
● 40 టీఎంీసీలకు పడిపోయిన నీటి మట్టం
● వేగంగా తగ్గుదల
● కాలువల ద్వారా కొనసాగుతున్న
నీటి విడుదల
బాల్కొండ: యాసంగి సీజన్ పంటల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడు దల కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. శనివారం నాటికి సగం నీరు ఖాళీ అయ్యింది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటల కోసం గతేడాది డిసెంబర్ 25 నుంచి నీటి విడుదలను ప్రారంభించారు. సుమారు 50 రోజుల వ్యవధిలో 40.5 టీఎంసీల నీరు ఖాళీ అయ్యింది. వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు 10 టీఎంసీల నీటిని తరలించడంతో నీ టి మట్టం వేగంగా తగ్గగా, మరో 70 రోజులపాటు నీటిని తరలించాల్సి ఉంది. ప్రస్తుత లెక్క ప్రకారం చూస్తే ఆయకట్టుకు చివరిలో నీటి తిప్పలు తప్పేలాలేవు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో నుంచి 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, 5 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 3 టీఎంసీలు ఆవిరి రూపంలో పోగా మి గిలేది 27 టీఎంసీలు మాత్రమే. ఇకనైనా ప్రాజెక్ట్ అధికారులు, ఆయకట్టు రైతులు సమన్వయంతో నీటి వినియోగం చేపడితే కొంత మేర నీటి తిప్పలు తప్పే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే చేతికొచ్చే సమయంలో పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
వరద కాలువకు 3వేలు..
కాకతీయకు 2,500 క్యూసెక్కులు..
ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కులు, వరద కాలువకు 3 వేలు, లక్ష్మికాలువకు 250, సరస్వతి కాలువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, గుత్ప లిఫ్ట్‌కు 225, అలీసాగర్ లిఫ్ట్‌కు 360, ముంపు గ్రామాల లిఫ్ట్‌లకు 312 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 309 క్యూసెక్కుల నీరు పోతుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
తగ్గిన ఎస్సారెస్పీ నీటి మట్టం
Comments
Please login to add a commentAdd a comment