కేసీఆర్‌ను బహిష్కరించడం కలలో మాట
వేల్పూర్: కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం కలలో మాట అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లోని క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం సాధించకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది అని అన్నారు. కేసీఆర్ తెలంగాణా తీసుకురాకుంటే రేవంత్‌రెడ్డి ఆంధ్రాపాలకుల మోచేతినీళ్లు తాగుతూ బతికే వాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తానని గద్దెనెక్కి 14 నెలలు దాటినా ఒక్క హామీ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్రజలు గుర్తించడం లేదని, సొంత పార్టీ నాయకులే ఆయన పేరు మరచిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిపాలన దేశమంతా తెలిసిపోయిందన్నారు. కులగణన అంతా బోగస్ అని, మీపై నమ్మకం లేకే ప్రజలు సర్వేలో పాల్గొనలేదన్నారు. సర్వేలో పాల్గొన్న వారు సరైన వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. 15 ఏళ్లపాటు సుదీర్ఘపోరాటం చేసి, ఎన్నో పదవులు గడ్డిపోచలా వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని అన్నారు. ఇప్పటికై నా రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు.
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత రేవంత్‌ది
ఆయనను ప్రజలు గుర్తించడం లేదు
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment