వేసవిలోనూ నిరంతర విద్యుత్
సుభాష్‌నగర్: వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ఎన్‌పీడీసీఎల్ పని చేస్తుందని ఎస్‌ఈ రాపల్లి రవీందర్ అన్నారు. నగరంలోని డీ–2 సెక్షన్ తిలక్‌గార్డెన్ సబ్‌స్టేషన్‌లోగల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను 8.0 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏగా మార్చి అమర్చారు. ఈసందర్భంగా శుక్రవారం నూతన ఎంవీఏను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తిలక్‌గార్డెన్ సబ్‌స్టేషన్‌లో రెండు 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని, అందులో ఒక 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.1.50 కోట్లతో 12.5 ఎంవీఏగా మార్చామని తెలిపారు. పట్టణ ప్రజలకు సబ్‌స్టేషన్‌లో అంతరాయం ఏర్పడితే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అందించడానికి 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అమర్చామన్నారు. డీఈ ఎం శ్రీనివాస్‌రావు, డీఈఎంఆర్‌టీ వెంకటరమణ, టౌన్–2 ఏడీఈ ప్రసాద్‌రెడ్డి, ఏడీఈలు చంద్రశేఖర్, వీరేశం, నటరాజ్, తోట రాజశేఖర్, ఏఈలు జాకీర్‌అలీ, రాజేందర్‌రెడ్డి, సాయిలు, దుర్గా ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రతపై
విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కోటగల్లి ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం శాస్త్రము–ఆరోగ్యము అనే అంశంపై జిల్లా వైద్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగాలు దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, సౌందర్య, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
వేసవిలోనూ నిరంతర విద్యుత్
Comments
Please login to add a commentAdd a comment