ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని 13వ డివిజన్ సారంగాపూర్‌లో నీటి కొరత తీర్చాలంటూ మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్– బోధన్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఖాళీ బిందెలు పట్టుకొని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెలరోజులుగా తాగునీటి సరఫరా సరిగా జరగడం లేదని, నీటి సరఫరా చేసే బోరు మోటార్లు తరచూ పాడైపోతున్నాయని పేర్కొన్నారు. తాగునీటి ఇబ్బందులు తీర్చాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువైందని తెలిపారు. నెలరోజుల క్రితం సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని సారంగాపూర్ వాసి అక్బర్ నవాజుద్దీన్, వడ్డెర కాలనీ వాసి పల్లెపు యాదేశ్ ఆరోపించారు.
రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సారంగాపూర్ చేరుకొని తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.
సారంగాపూర్‌లో రాస్తారోకో
నెల రోజులుగా తాగునీటి కోసం
ఇబ్బంది పడుతున్నామని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment