బీజేపీలో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీలో జోష్‌

Published Thu, Mar 6 2025 1:36 AM | Last Updated on Thu, Mar 6 2025 1:34 AM

బీజేప

బీజేపీలో జోష్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: భారతీయ జనతా పా ర్టీ నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త జోష్‌ నెలకొంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం రెండో ప్రాధాన్యత ఓటుతో విజ యం సాధించారు. వరుసగా మూడురోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ అంజిరెడ్డి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. త్రిముఖ పోరులోనూ అంజిరెడ్డి ఆధిక్యం ఏ రౌండ్‌లోనూ తగ్గలేదు. అయితే ప్ర తి రౌండ్‌లోనూ ఆధిక్యత మాత్రం స్వల్పంగానే వ చ్చింది. గెలుపునకు అవసరమైన నిర్ధారిత 50 శాతం ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ రౌండ్ల ప్రక్రియ తప్పలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ నిర్ధారిత 50 శాతం ఓట్లు ఎవరికీ రాలేదు. 54 మంది అభ్యర్థులు ఎలిమినేట్‌ అయ్యాక మిగిలిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి లలో ఎవరికీ నిర్ధారిత ఓట్లు రాకపోవడంతో ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డి గెలుపొందినట్లుగా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రెండు స్థానాల్లోనూ విజయం లభించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.

ఇందూరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజాగా ఎమ్మెల్సీ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా తెలిసింది. రోజురోజుకూ పార్టీ ప్రాబల్యం పెరిగింది. జిల్లాలో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇదే ఉత్సాహంతో, ప్రజాదరణతో జెడ్పీ పీఠం, అత్యధిక ఎంపీపీ స్థానాలు, పంచాయతీల్లో గెలుస్తాం. మున్సిపల్‌ ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడి నుంచే చరమగీతం పాడి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకుంటాం. ఇక బీఆర్‌ఎస్‌కు సైతం ఇక్కడినుంచే చరమగీతం పాడాం. తాజా విజయం బీజేపీ కార్యకర్తలందరిది. కార్యకర్తలు, నాయకులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. – ధర్మపురి అర్వింద్‌, ఎంపీ

పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచి..

సుభాష్‌నగర్‌: ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించడంతో బుధవారం రాత్రి బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్సీ ఫలితంతో తేలిపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్వామియాదవ్‌, హరీశ్‌ రెడ్డి, మెట్టు విజయ్‌, ఇప్పకాయల కిశోర్‌, శంకర్‌, విజయకృష్ణ, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల గెలుపుతో శ్రేణుల్లో ఉత్సాహం

సంబరాలు జరుపుకున్న

నాయకులు, కార్యకర్తలు

స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం: ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌ జిల్లాలో లోక్‌సభ ఎంపీతో పాటు నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ శాసనసభ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. తాజాగా పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలనూ బీజేపీ కై వసం చేసుకుంది. ఇదే ఊపులో నిజామాబాద్‌ జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌లు, అత్యధిక పంచాయతీలు, మున్సిపాలిటీలు, నిజామాబాద్‌ నగరపాలక సంస్థలోనూ పాగా వేస్తామని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి మహిళలు, యువత, ఇతర సాధారణ ఓటర్ల వరకు తమకు తిరుగులేని ఆదరణ ఇస్తున్నట్లు తాజాగా మరోసారి నిరూపితమైందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లోనూ పాగా వేస్తామంటున్నారు. గత ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను 28 డివిజన్లను బీజేపీ కై వసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి సంపూర్ణ మెజారిటీతో నిజామాబాద్‌ నగరపాలకంలో పాగా వేస్తామని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బీజేపీలో జోష్‌1
1/1

బీజేపీలో జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement