ఎల్లారెడ్డిపల్లె వాసికి ఆంత్రిక్ సురక్ష సేవా పతక్
ఇందల్వాయి: భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లెకు చెందిన జవాన్ జీఎం నగేశ్‌కు కేంద్రం హోంశాఖ ఆంత్రిక్ సురక్ష సేవా పతక్‌ను అందజేసింది. సశస్త్ర సీమాబల్‌లో జవాన్‌గా కొనసాగుతున్న నగేశ్ నేపాల్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. తన సేవలను గుర్తించి గత సోమవారం కేంద్ర హోంశాఖ ఆంత్రిక్ సురక్ష సేవా పతక్‌ను అందజేసిందని, పతకం అందుకోవడం తనకు గర్వంగా ఉందని నగేశ్ అన్నారు.
గంజాయి,
అల్ప్రాజోలం దహనం
జక్రాన్‌పల్లి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, అల్ప్రాజోలంను మండలంలోని ప డకల్ గ్రామంలో ఉన్న శ్రీ మెడికేర్ సర్వీసెస్ లో బుధవారం దహనం చేశారు. 23 కేసుల్లో పట్టుబడిన 616 కిలోల 837 గ్రాముల గంజాయి, 3 కిలోల 444 గ్రాముల అల్ప్రాజోలాన్ని ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ, డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కమిటీ సభ్యులు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రా మ్‌రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను
అప్రమత్తం చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టా ల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సారి వేసవి సీజన్‌లో సాధారణం కన్నా ఎ క్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంద న్న హెచ్చరిక నేపథ్యంలో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీ రు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆరో గ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, కరపత్రాల ద్వారా వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
అలీసాగర్ ఫిల్టర్ బెడ్ పరిశీలన
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్‌కు తాగునీటిని అందించే అలీసాగర్ వాటర్ ఫిల్టర్‌బెడ్‌ను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. వేసవి కా లం ప్రారంభమైనందున నగరంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎల్లారెడ్డిపల్లె వాసికి ఆంత్రిక్ సురక్ష సేవా పతక్
ఎల్లారెడ్డిపల్లె వాసికి ఆంత్రిక్ సురక్ష సేవా పతక్
Comments
Please login to add a commentAdd a comment