ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మొత్తం 19,191 మంది విద్యార్థులకు గాను 18,438 మంది హాజరుకాగా, 753 మంది గైర్హాజరయ్యారన్నారు. 57 పరీక్ష కేంద్రాలకు గాను 50 కేంద్రాలను తనతోపాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేశారన్నారు. – నిజామాబాద్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment