నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి
పన్ను వసూళ్లపై..
ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ రుసుము వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా పాత బకాయిలతోపాటు వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీఎల్‌పీవోలను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ఫీజు ఈనెలాఖరు లోగా చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందన్నారు.
నిజామాబాద్ అర్బన్: వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్), ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్క్‌ఔట్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లయింట్ బాక్సుల ఏర్పాటు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామాల వారీగా నీటి సరఫ రా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, అవసర మైన చోట్ల చేతిపంపులు, బోరు బావులకు మరమ్మ తులు చేయించాలన్నారు. రెండు రోజుల్లో మరమ్మ తులు పూర్తి చేయించాలని ఆదేశించారు. మంచినీటి పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పరీక్షల సీజన్‌లో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేలా మార్క్‌ఔట్ త్వరితగతిన చేసి ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపర్చాలని కలెక్టర్ అన్నారు.
ఫిర్యాదుల పెట్టెలు..
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఫిర్యాదు పెట్టెలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీటి ద్వారా అందే ఫిర్యాదులను ప్రతి వారం పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రవీందర్, జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేంద్రకుమార్, ఈఈలు రాకేశ్, స్వప్న, మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సమస్యలు తలెత్తకుండా
ముందస్తు చర్యలు తీసుకోవాలి
తాగునీటి పథకాలకు నిరంతర
విద్యుత్ అందించండి
గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్
రాజీవ్‌గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment