తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 21 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ సెమి నార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మామిడాల ప్రవీణ్ తెలిపారు. వైస్ చాన్స్‌లర్ టీ యాదగిరిరా వు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి బుధవారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్సీ, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం, సెల్ఫ్ కేర్ అనే అంశాలపై ఐదు రోజులపాటు అంతర్జా తీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. యునైటెడ్ వే హైదరాబాద్ సౌజన్యంతో నిర్వహించనున్న సదస్సులో ‘రిమైనింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండి యా’ అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫె సర్లు ప్రసంగిస్తారని తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ పావని, డాక్టర్ కాండీసీ, డాక్టర్ షో కి, డాక్టర్ గాబ్రియల్, డాక్టర్ బెన్, డాక్టర్ డోరిస్, శ్రేయ అలెగ్జాండర్లు రిసోర్స్ పర్సన్ గా పాల్గొంటారని కన్వీనర్ ప్రవీణ్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ రెడ్డి, పీఆర్‌వో డైరె క్టర్ ఏ పున్నయ్య, నాగరాజు, సంపత్, జమీల్ అహ్మ ద్, దత్తహరి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొననున్న హార్వర్డ్
యూనివర్సిటీ ప్రొఫెసర్లు
Comments
Please login to add a commentAdd a comment