కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

Published Wed, Mar 26 2025 1:15 AM | Last Updated on Wed, Mar 26 2025 1:17 AM

కాలువ

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

బాల్కొండ: మండలంలోని కాకతీయ కాలువలో పడి ఒకరు మృతిచెందగా, మృతుడి ఆచూకీ కోసం వచ్చిన మరో వ్యక్తి అదే కాలువలో పడి గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలుకకు చెందిన దేశ్‌ముఖ్‌ మారుతి(32) కూలీ పనుల కోసం ఇటీవల మెండోరాకు వచ్చాడు. రెండు రోజుల క్రితం మారుతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువ వద్ద అతడి చెప్పులు ఆధారంగా మంగళవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెతకడానికి వెళ్లి..

మారుతి గల్లంతయ్యాడని తెలియడంతో వెతుకుట కోసం అదే గ్రామానికి చెందిన హరి లఖోడి రాజారాం, అవినాష్‌ బైక్‌పై సోమవారం బయలుదేరారు. వెల్కటూర్‌ గ్రామ శివారులోని కాకతీయ కాలువ వద్ద వీరి బైక్‌ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెనుక కూర్చున్న అవినాష్‌ పక్కకు దూకగా, బైక్‌పై ఉన్న రాజారాం బైక్‌తో సహ కాలువలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ పేర్కొన్నారు. గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

అనారోగ్యంతో గన్నారం జీపీ కార్యదర్శి మృతి

ఇందల్వాయి: గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌1) వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉంటూ గన్నారంలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడి స్వస్థలం జోగులాంబ గద్వాల్‌ జిల్లా మానవపాడు మండలం అని తెలిసింది. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం.

గుండెపోటుతో వివాహిత..

ఆర్మూర్‌టౌన్‌: పెర్కిట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఓ వివాహితకు ఆపరేషన్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. వివరాలు ఇలా.. మోర్తాడ్‌ మండలం ఏర్గట్ల గ్రామానికి చెందిన మార్వాడి మాన్విత(23)కు ఐదేళ్ల క్రితం నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం జరిగింది. పిల్లలు పుట్టటం లేదని మాన్వితకు మంగళవారం పెర్కిట్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందింది. భర్త సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ..

ఎల్లారెడ్డి: మెదక్‌ జిల్లా మాసాయిపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం కొట్టాల్‌ గ్రామానికి చెందిన బోదాటి సాయవ్వ (43) అనే మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయవ్వ దంపతులు కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. ఈక్రమంలో మాసాయిపేటలో కూలి పనులు చేసేందుకు రైలు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో సాయవ్వను ఓ ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. సాయవ్వ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కొట్టాల్‌లో నిర్వహించినట్లు తెలిపారు.

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
1
1/2

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
2
2/2

కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement