
ప్రతి ఒక్కరూ లోకహితం కోసం పనిచేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ లోకహితం కోసమే పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఆమంత్రిత సభ్యులు రాంపల్లి మల్లికార్జున్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్‌లో ఉగాది మహోత్సవంనిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదే శంలో నివసించే వారంతా హిందువులేనని, ఈ విషయాన్ని వందేళ్ల క్రితమే ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ స్పష్టంగా తెలియజేశారన్నారు. ఆ ఒక్క మాట ఆధారంగానే వందేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ దేశ సమగ్రత కోసం పనిచేస్తోందన్నారు. హిందూ సమాజాన్ని కలిపి ఉంచేందుకు సంఘటన మంత్రాన్ని పఠించారన్నారు. ప్రతి హిందువు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి లోకహితం కోసం పనిచేయాలన్నారు. ముఖ్య అతిథి, వైద్యుడు అంకం గణేశ్ మాట్లాడు తూ.. హిందూ సమాజం కలిసి ఉండడం ఒక్కటే అన్ని సమస్యలకు సమాధానమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.