ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుంది
● అదనపు కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుందని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో అలుక కిషన్, అమృత్ కుమార్, వాజిద్ హుస్సేన్, యోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌జీ గార్డెన్‌లో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ముస్లిములకు బీఆర్‌ఎస్ నాయకులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, సాంబరి మోహన్, శక్కరికొండ కృష్ణ, దాసరి లక్ష్మీనర్సయ్య, ఒడ్డెం నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.