మార్కెట్‌లో సమస్యల పరిష్కారానికి కృషి
సుభాష్‌నగర్: గాంధీగంజ్‌లో ఉన్న కూరగాయల రిటైల్ మార్కెట్‌లో విక్రయదారులకు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని గాంధీగంజ్‌ను సందర్శించారు. మార్కెట్‌లో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా కూరగాయలు విక్రయించుకోవాలన్నారు. విక్రయదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా విక్రయదారులు, రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారం కోసం మార్కెట్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం డ్రెయినేజీ మరమ్మతుల పనులను పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ సిబ్బంది ఉన్నారు.
నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి