
అల్ప్రాజోలం పట్టివేత
నిజామాబాద్‌రూరల్: నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ సమీపంలో ఉన్న హను మాన్ ఆలయం వద్ద కిలో అల్ప్రాజోలం, రూ. 3.50 లక్షల నగదును మంగళవారం స్వాధీ నం చేసుకున్నట్లు ట్రెయినీ ఐపీఎస్ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు గంధం శ్రీనివాస్ కారులో వచ్చి జీజీ కాలేజ్ సమీపంలో అల్ప్రాజోలం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రూరల్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు ఎవరెవరికి విక్రయించాడనే వివరాలు సేకరించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన బొట్లకుంట కాటమయ్య గౌడ్, మల్లి అనిల్‌గౌడ్, ఇడిగి శ్రీనివాస్‌కు అల్ప్రాజోలం విక్రయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు వెళ్లిపోవడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడితో ఫోన్ చేయించి వారు రాగానే అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలో అల్ప్రాజోలం, రూ.3.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.