
భారతీయ సంస్కృతి గొప్పది
రెంజల్: భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. రుషీ పరంపర గొప్పదని, పూర్వీకులు అందించిన ఆచార వ్యవహారాలను పాటించి, దీపాలు ఆర్పే పాశ్చాత్య సంస్కృతిని తరిమివేయాలని సూచించారు. రెంజల్ మండలం కందకుర్తిలో శుక్రవారం నిర్వహించిన విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రవచించారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం ద్వారా జీవితం ధన్యమవుతుందన్నారు. అంతకు ముందు గ్రామంలో పలు విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. కా ర్యక్రమంలో పిట్ల కృష్ట మహరాజ్, మంగిరాములు మహరాజ్, సీతారాం త్యాగి మహరాజ్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు సుందర్‌రెడ్డి, తిప్పేస్వామి, మోహన్‌రెడ్డి, ప్రసాద్, సోమయాజులు, దుర్గారెడ్డి, సుధాకర్‌రెడ్డి, లింగం, చంద్రశేఖర్, నిమ్మల ప్రసాద్, గురచరణం, శివకుమార్, ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి పాల్గొన్నారు.
హంపీ పీఠాధిపతి
విద్యారణ్య భారతీస్వామి