
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని 33/11 కేవీ వినాయక్‌నగర్, తిలక్‌గార్డెన్, సుభాష్‌నగర్, ఎన్‌హెచ్‌బీ సబ్‌స్టేషన్లలో నెలవారీ మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం కలుగుతుందని టౌన్ ఏడీఈ ఆర్ చంద్రశేఖర్, టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్, హనుమాన్ జంక్షన్, ఓల్డ్ హౌసింగ్ బోర్డు కా లనీ, 100 ఫీట్ల రోడ్డు, ఐపీఎస్ స్కూల్ ఏరి యా, గూడెం, తుల్జాభవానీ ఆలయం, సా యికృపానగర్, యోగేశ్వర్ కాలనీ, ఇంద్రాణి స్కూల్, దత్తాత్రేయ ఆలయం, శ్రీనగర్ కాలనీ, కోటగల్లి, యెండల టవర్స్, గాయత్రినగర్, పద్మానగర్, మదీనా, ఫులాంగ్ మసీ ద్, పాటిగల్లి తదితర కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదా రులు సహకరించాలని చంద్రశేఖర్ కోరారు.
పోలీస్ స్టేషన్ల తనిఖీ
ఖలీల్‌వాడి: నగరంలోని మూడు, నాలుగు టౌన్లతోపాటు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్లు, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలుపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఎవరైనా గంజాయికి బానిసలైతే వారికి కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూ చించారు. సీపీ వెంట ట్రైయినీ ఐపీఎస్ సాయికిరణ్ పత్తిపాక, ఏసీపీ ఎల్ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు గంగాధర్, శ్రీకాంత్, ఎండీ ఆరిఫ్ తదితరులు ఉన్నారు.
30 వరకు ‘భూ భారతి’ అవగాహన సదస్సులు
నిజామాబాద్ అర్బన్: ‘భూ భారతి’ చట్టంపై జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రా జీవ్‌గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది వరకే ఆయా మండలాలకు అవగాహన సదస్సుల నిర్వహణకు సంబంధించి సమావేశ వేదికలు, సమయాలను నిర్దేశించినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తాగునీరు, ధాన్యం
కొనుగోళ్లపై ‘కంట్రోల్ రూం’
● టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఎక్కడైనా తా గునీటి సమస్య తలెత్తినా, ధాన్యం కొనుగో లు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644 కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని సూచించారు. కార్యాలయాల పని దినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిర్యాదులను స్వీకరించి తక్ష ణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఉంటే 7382844951, ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులుంటే 7382844769 ఫోన్ నంబర్లకు వాట్సాప్ చేయాలని సూచించారు. idocnizamabad@gmail.comకు మెయిల్ ద్వారా కూడా సమాచారం అందించాలని పేర్కొన్నారు.
21 నుంచి కిసాన్ మేళా
నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో ‘కిసాన్ మేళా’ నిర్వహించనున్నట్లు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభిస్తారని, మూడు రోజులపాటు జరిగే ఈ మేళాలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు, వారి ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచనున్నట్లు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని కోరారు.