
ఆపన్నహస్తం అందించండి
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన యువకుడు పసుల ఆకాశ్ ఈ నెల 11న బైక్‌పై వస్తుండగా నూర్‌సింగ్ తండా వద్ద మరో వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆకాశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని సరోజిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్‌లోని నరాలు చిట్లిపోయాయని, కుడి కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఆపరేషన్ కోసం రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో
ఇడ్లీ సెంటర్‌తో ఉపాధి..
ఆకాశ్‌కు భార్య మౌనిక, ఐదేళ్ల లోపు పాప, ఓ బాబు ఉన్నారు. ఆకాశ్ ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కొంత వరకు అప్పులు చేసి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఉద్యోగం రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో ఇటీవల కలిగోట్‌లో చిన్న ఇడ్లీ సెంటర్ ప్రారంభించాడు. ఇడ్లీ సెంటర్ ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆకాశ్ రో డ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలు కావడంతో కుటుంబం దిక్కుతోచనిస్థితికి చేరింది. ప్ర స్తుతం ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే డబ్బులు సమకూర్చుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆకాశ్‌కు మెరుగైన వై ద్యం కోసం పడకల్ గ్రామస్తులు, యువకులు తమవంతుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఆర్థికసాయం చేయదల్చిన దాతలు ఆకాశ్ సోదరుడు పసుల రవి సెల్ నంబర్‌కు 91823 98298కు ఫోన్‌పే చేయగలరు.
రోడ్డు ప్రమాదంలో పడకల్
యువకుడికి తీవ్ర గాయాలు
చికిత్సకు సుమారు
రూ.6లక్షల వరకు అవసరం
దాతల కోసం బాధిత
కుటుంబ సభ్యుల ఎదురుచూపు