
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
బోధన్: తనపై ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలను మానుకుని నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించగా షకీల్ హాజరై మాట్లాడారు. తనతోపాటు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టెర్రరిస్ట్‌తో వ్యవహరించినట్లు తన ఇంటికి 300 మంది పోలీసులను పంపించి ఆడపిల్లలు, చిన్న పిల్లలని చూడకుండా భయానక వాతావరణం సృష్టించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రూ.వందల కోట్ల రైతుల ధాన్యం దండుకుని దుబాయి పారిపోయినట్లు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలు ఏవీ తన వద్ద లేవన్నారు. ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిపై ఎమ్మెల్యేను నిలదీయాలని ప్రజలను కోరారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యేతో బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు.
పదేళ్ల కేసీఆర్ పాలన సువర్ణాధ్యాయం
పదేళ్ల కేసీఆర్ పాలన దేశచరిత్రలోనే సువర్ణాధ్యాయమని షకీల్ అన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభకు గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, గిర్దావర్ గంగారెడ్డి, నర్సింగ్‌రావు, శ్రీరాం, సంజీవ్, గోగినేని నర్సయ్య, భూంరెడ్డి, శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధిపై ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో చర్చించేందుకు సిద్ధం
బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్