
ఫసల్ బీమా అమలుచేయాలి
రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఫసల్ బీమా యోజన ప్రీమియం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. మండల కేంద్రాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని, యంత్ర పరికరాలు అందించాలన్నారు.
ప్రాణహిత–చేవెళ్లకు
నిధులు కేటాయించాలి..
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ 20, 21, 22 ప్యాకేజీ పనులను అధిక ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి వెంటనే నిధులు కేటాయించాలని, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంత్రి ఉత్తమ్‌ను కోరారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
బోనస్ త్వరగా జమ చేయాలి
రాష్ట్రంలో రైతులను ఆదుకునేలా నిర్ణయాలు, పథకాలను ప్ర భుత్వం అమలు చేయా లని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ధా న్యం బోనస్ డబ్బులు త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఫసల్ బీమాతో రైతులకు ప్రయోజనం చేకూరుతోందని, ఈపథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు.

ఫసల్ బీమా అమలుచేయాలి

ఫసల్ బీమా అమలుచేయాలి