దేశం గర్వపడేలా సీఎం జగన్‌ పాలన: ఆస్ట్రేలియాలో మంత్రి ఆర్కే రోజా | AP CM YS Jagan making country proud: Minister RK Roja meets YSRCP in Australia | Sakshi
Sakshi News home page

దేశం గర్వపడేలా సీఎం జగన్‌ పాలన: ఆస్ట్రేలియాలో మంత్రి ఆర్కే రోజా

Published Mon, Aug 29 2022 9:25 AM | Last Updated on Mon, Aug 29 2022 12:55 PM

AP CM YS Jagan making country proud: Minister RK Roja meets YSRCP in Australia - Sakshi

ఆస్ట్రేలియా: దేశం గర్వపడేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఆదివారం  ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నారైల సమావేశంలో ఆమె,  మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కదం తొక్కుతూ హాజరైన ఎన్నారైల నుద్దేశించి మంత్రి ఆర్ కే రోజా మాట్లాడుతూ నవరత్న పథకాలతో ప్రతి పేదవాని ఇంట నేడు వెలుగులు విరజిమ్ముతోందని ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి, నాయకుడంటే ఇలా ఉండాలని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారు అన్నారు.

పేగు పంచిన విజయమ్మ, రక్తం పంచిన రాజన్న, పురుడు పోసిన పులివెందుల, పట్టం కట్టిన ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా జగనన్న పాలిస్తున్నారు అన్నారు. దేశం కోసం యుద్ధం చేస్తే అతను సైనికుడు అని, ధర్మం కోసం యుద్ధం చేస్తే అతను రాముడని, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే అతను నాయకుడని, అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తాను ప్రవేశపెట్టిన అర్హులైన అందరికీ అవుతుందా అని తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. దీంతో పేద ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతోందన్నారు.  దేశీ చదువులతో పాటు విదేశీ చదువులకు కూడా విదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగనన్న అన్నారు. ఆయనతోపాటు ఆయన స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం అన్నారు.

2024 లోను ఇలాంటి జనరంజకమైన పాలన కొనసాగడానికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు అండగా నిలవాలని అన్నారు. ఎన్.ఆర్.ఐ ల గళం నారాసురునికి  వినిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో భరత్, బ్రహ్మారెడ్డి, రామంజి, మణిదీప్, తరుణ్, సతీష్ పాటి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement