సింగపూర్‌లో 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి మా రెండేళ్ల ప్రయాణం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా విరాజిల్లేలా సంస్థ స్థాపించిన మొదటి రోజు నుండి సింగపూరులో నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలను వెలుగులోకి తెస్తుందంటూ ప్రముఖులు కొనియాడారు.
అనంతరం సంస్థ ప్రధాన ప్రధాన కార్యవర్గ సభ్యుల అంతరంగాలను ఆవిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కవుటూరు రత్నకుమార్, సుబ్బు వి పాలకుర్తి,రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయనిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment