సింగపూర్: భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యం గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సొంత నేలకు దూరంగా సింగపూర్‌లో ఉంటున్న కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులందరూ కలిసి సింగపూరు యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ & డిజైన్ (SUTD) నందు ఆదివారం (29-01-2023) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు హాజరైప ఈ కార్యక్రమంలో పిల్లల, పెద్దల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు ఆ 4 రోజులూ జరుపుకునే పండుగ సాంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను అతి చక్కగా పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించబడి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితోకలిపి జరుపుకుంటున్న 2వ అతి పెద్ద పండుగ ఇది అని వివరించారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమమం ద్వారా మరింత మంది సాటి తెలుగు వారు సన్నిహుతులు అయ్యారని అలాగే విభిన్న ఆటలద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమ రూపకల్పన చక్కగా ఉంది అని పలువురు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment