
కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది తెలుగు వారు వచ్చిన ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఎంతో మంది చక్కగా బతుకమ్మ లను చేసుకొని వచ్చి, మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ఆడి, పాడి ఆనందించారు. దేవాలయ పూజారి నిర్వహించిన అమ్మ వారి పూజ తో సంబరాలు ఆరంభం అయ్యాయి.

పెద్ద వాళ్ళే కాకుండా, చిన్నపిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. బతుకమ్మలు తెచ్చిన వారికి రాఫెల్ టికెట్స్ ఇచ్చి మధ్య మధ్యలో రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మలన్నింటిలో మంచిగా చేసిన 8 బతుకమ్మలకు బహుమతులు ఇచ్చారు.

చివరన బతుకమ్మలను నిమజ్జనం చేసి అందరూ ఒక కుటుంబం వలె ప్రసాదం పంచుకొని సంబరాలని ముగించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గ సభ్యులకి, స్పాన్సర్‌కి సంఘం అధ్యక్షుడు యక్కలి చంద్ర, ట్రస్ట్ ఛైర్ శివ తియగూర ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!)
Comments
Please login to add a commentAdd a comment