ఫైల్ ఫోటో
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలల క్రితం భార్యా భర్తలిద్దరు కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. శనివారం బందువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!)
ఈ ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే నెల రిటైర్మెంట్ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నరసింహారెడ్డి స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment