న్యూజెర్సీలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్‍ అండ్‍ గ్రీట్‍ | TTA meet and greet was a grand success | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్‍ అండ్‍ గ్రీట్‍

Published Tue, Mar 7 2023 11:14 PM | Last Updated on Tue, Mar 7 2023 11:27 PM

TTA meet and greet was a grand success - Sakshi

తెలంగాణ అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ TTA  న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెసిడెంట్‍ వంశీ రెడ్డి మీట్‍ అండ్‍ గ్రీట్‍ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో  టీటీఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వంశీ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

 కమ్యూనిటీ సర్వీసెస్, భవిష్యత్ లక్ష్యాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీటీఏ కన్వెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు వంశీరెడ్డి తెలిపారు. ఇక న్యూయార్క్ చాప్టర్ సభ్యులను ఆయన అభినందించారు. తమకు అండగా ఉంటూ సహాయసహాయకారాలు అందిస్తున్న  ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇక టీటీఏ కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు న్యూయార్క్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం  అవటం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. 
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement