స్వరపేటిక క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స
జీజీహెచ్‌లో రెండేళ్లలో నలుగురికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో గత ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు సమకూర్చడంతో క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా జీజీహెచ్ ఈఎన్‌టీ విభాగంలో స్వరపేటిక క్యాన్సర్‌కు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అంతేకాదు రెండేళ్లలో నలుగురికి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కె.రవి తెలిపిన వివరాల ప్రకారం ఆటోనడుపుకునే 52 ఏళ్ల సుదర్శన్‌కు ఊపిరి ఆడకపోవడం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలతో చికిత్స నిమిత్తం ఈఎన్‌టీ విభాగానికి వచ్చారు. అతనికి పరీక్షలు చేసి స్వరపేటిక క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించి ల్యారింజెక్టమీ చేయాలని తెలిపారు. దీంతో ఈ నెల 14న సుదర్శన్‌కి ఈఎన్‌టీ వైద్యుల బృందం క్లిష్టతరమైన ల్యారింజెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో ఈఎన్‌టీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు డాక్టర్ జీబీ శ్రీనివాస్, డాక్టర్ కె.ఆదిత్య, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్‌కుమార్, డాక్టర్ కిరణ్, డాక్టర్ సుష్మ, డాక్టర్ చరణ్ పాల్గొన్నారు. విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.
స్వరపేటిక క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స
Comments
Please login to add a commentAdd a comment