విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Sat, Feb 22 2025 1:47 AM | Last Updated on Sat, Feb 22 2025 1:42 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఇదీ విషయం..

సాంకేతిక సాయంతో నేరాల అదుపు

పామర్రు: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తున్నామని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. పామర్రు సర్కిల్‌, గన్నవరం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

నేటితో తిరునాళ్ల ముగింపు

వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు బారులు తీరారు.

తిరుపతమ్మకు బంగారు నెక్లెస్‌

పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి శుక్రవారం తెనాలికి చెందిన లంక శ్రీనివాసరావు, రత్నజ్యోతి దంపతులు 20గ్రా. బంగారు నెక్లెస్‌, 135గ్రా. వెండి గిన్నెను అందజేశారు.

10లోu

నేడు, రేపు ఉచిత పుస్తకాల పంపిణీ

పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడ పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఉచిత పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారదా తెలిపారు. శుక్రవారం పటమటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా తాము ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెండు రోజుల పాటు జరిగే ఈ పంపిణీ తొలుత 6 వేల పుస్తకాలతో ప్రారంభమైందని, ఈ ఏడాది పుస్తకాలను 30 విషయాలుగా విభాగించి సామాన్యుడు సైతం సులభంగా పుస్తకాలను ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో చిన్నపిల్ల ల పుస్తకాలు నుంచి వేదాంత గ్రంథాలు, అన్ని తరగతుల పాఠ్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ అరుదైన గ్రంథా లు, వైద్యశాస్త్రంలో వేదం వంటి రెండు సంపుటాల హరిసన్స్‌, మెడిసిన్‌, మరెన్నో ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ ఇంతియాజ్‌ ప్రారంభిస్తారని, పుస్తక ప్రియులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు స్టాండింగ్‌లో నుంచి తీసే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. ప్లాట్‌ఫాంపై ఉన్న పిల్లరును ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు లేక పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు, ఆర్టీసీ డ్రైవర్‌కు ఎటువంటి ప్రమాదం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదేవిధంగా జరిగిన ఘటనలో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి ఘటనే జరగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల నెత్తిన బండ వేసింది. విజయవాడలో ఆటో రిక్షాల సంఖ్యపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో నంబర్‌–8 జారీ చేసింది. అదే సమయంలో పాత ఆటో రిక్షాలను నగరం లోనికి అనుమతించబోమని జీవోలో పేర్కొంది. దీంతో ఏళ్ల తరబడి నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్త కొత్త జీవోలతో ఉపాధిని దెబ్బతీస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై ఆటో డ్రైవర్లు, యజమానులు, ఆటో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

నష్టం ఎందుకుంటే..

ప్రస్తుతం బీఎస్‌–6, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, బ్యాటరీ ఆటోలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు జిల్లాల పునర్విభజన కూడా జరిగిన నేపథ్యంలో ఆటోల సంఖ్యపై నిషేధం ఎత్తివేస్తూ తాజాగా కూటమి ప్రభుత్వం జీవో నంబర్‌–8 జారీ చేసింది. అయితే ఈ జీవోలో ఓ మెలిక పెట్టింది. అడ్రస్‌ మార్పు, ఓనర్‌షిప్‌ బదిలీతో వచ్చే పాత ఆటోలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. దీనిపైనే ఆటో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో అనుమతి ఉన్న ఆటోలు, జి. కొండూరు, పరిటాల ప్రాంతాలకు చెందిన 6వేల ఆటోలను ఎప్పటిలాగే నగరంలో అనుమతివ్వాలని, ఇంకా కావాలంటే కొత్త వాటికి పర్మిషన్‌ ఇవ్వాలని కోరుతున్నాయి. అంతేగానీ పాత వాటిని అనుమతించేది లేదంటే కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నాయి.

అదనపు భారం..

చాలా మంది ఆటోలకు ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అనుమతి నిరాకరిస్తే అప్పు చేసి కొత్త ఆటోలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది కార్మికులకు అదనపు భారం అవుతుంది. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అదనంగా ఆర్థిక భారం పడే విధంగా జీవోలు జారీ చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. కేవలం ఆటోలు విచ్చలవిడిగా అమ్ముకునేందుకు షోరూంలకు మేలు చేసేదిగా జీవో ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న ఆటో రంగానికి.. కొత్త జీవో ద్వారా మరో దెబ్బతగిలిందని ఆటో వర్కర్లు వాపోతున్నారు.

7

న్యూస్‌రీల్‌

విజయవాడలో ఆటోల సంఖ్యపై పరిమితి ఎత్తివేత పాత ఆటోలకు అనుమతి ఉండదు జీవో నంబర్‌–8తో కార్మికులకు తీవ్ర నష్టం ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు

తక్షణమే జీవో రద్దు చేయాలి..

ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్‌–8 ఆటో కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుంది. ఇప్పటికే ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. ఆటోలు కొనుగోలు చేసేందుకు నిరుద్యోగులకు ఎటువంటి రాయితీలు లేవు. ఈ తరుణంలో ఇటువంటి జీవోలు జారీ చేయడం ఉపాధిని దెబ్బతీయడమే. తక్షణమే జీవో రద్దు చేయాలి.

– దాది శ్రీనివాసరావు,

ఆటో కార్మికుడు

పాత వాటికి అనుమతివ్వాలి..

ఇప్పటికే నగరంలో అనుమతి ఉన్న ఆటోలను యథాతథంగా అనుమతించాలి. ఆ తర్వాతే ఎన్ని ఆటోలకై నా నగరంలోకి అనుమతివ్వండి. పాత వాటిని అనుమతించబోమని చెప్పడం సరికాదు. ఇది కేవలం కంపెనీలకు మేలు చేసే జీవో. దీన్ని వ్యతిరేకిస్తున్నాం.

– కె. పోలారి, ఇఫ్టూ నాయకులు

2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విజయవాడలో ఆటోల సంఖ్యపై నిషేధం విధిస్తూ జీవో జారీ చేసింది. అప్పట్లో నగరంలో ఆటోల సంఖ్యను 8,600 పరిమితం చేసింది. ఆ తర్వాత 2006లో మహిళలకు ఉపాధి కల్పిస్తూ మరో 100 ఆటోలకు అనుమతిస్తూ ఆటోల సంఖ్యను 8,700 చేర్చింది. 2015లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చిందన్న కారణంగా ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు, కంకిపాడు మండలాలకు చెందిన 4,500 ఆటోలను నగరంలోనికి అనుమతించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఉయ్యూరు మండలానికి చెందిన ఆటోలను నగరంలోనికి అనుమిస్తూ మరో జీవో ఇచ్చింది. 2002 నుంచి ఇప్పటి వరకు విజయవాడ నగరంలో కొత్త ఆటోలకు పర్మిషన్‌ ఇవ్వలేదు. నగరంలో యువత ఉపాధి కోల్పోయింది. అయితే ఇటీవల ఆటో కంపెనీలు నగరానికి సమీపంలో ఉన్న జి. కొండూరు, పరిటాల తదితర ప్రాంతాల ఆటోలకు విజయవాడ నగరంలో అనుమతిస్తారని నమ్మబలకడంతో సుమారు 6వేల మందికిపైగా యువత ఆటోలు కొనుగోలు చేశారు. ఒక్క జి. కొండూరు మండలంలోనే 4వేల ఆటోలు కొనుగోలు చేశారు. వారంతా విజయవాడ నగరంలోనే ఆటోలు తిప్పుతున్నారు. ఈ ఆటోలకు నగరంలోకి అనుమతి లేదంటూ పోలీసులు తరచూ కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఆటో కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు సంబంధిత ఆటోలకు పోలీసులు నంబర్లు ఇచ్చి అనుమతించారు. అన్నీ కలుపుకుని మొత్తం 16 నుంచి 18వేల ఆటోలు నగరంలో తిరుగుతున్నాయి. వీటి ద్వారా కార్మికులు ఉపాధి పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/9

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement