పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం శుక్రవారం పర్యటించింది. ప్రొఫెసర్ల బృందం 5 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రాంలో భాగంగా జాయింట్ డైరెక్టర్ కల్నల్ పీఎస్.రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్‌లు డాక్టర్ కుమార్‌రాణా, డాక్టర్ బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వరద ప్రభావం అంచనా వేయటం, వాతావరణం మార్పులు, విపత్తు ప్రమాద నిర్వహణ, సర్వేలు చేయటం ఇలా పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కొల్లా నరేంద్ర మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదల్లో తమ వలంటీర్లు అంకిత భావంతో పని చేశారన్నారు. భవిష్యత్తులో కూడా తమ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవలు అందించటానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment