కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడులు
కోడూరు: కోడిపందేల శిబిరంపై కోడూరు పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. విశ్వనాథపల్లి శివారు కుమ్మరిపాలెం గ్రామంలో కోడిపందేల బరి జరుగుతుందనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఎస్‌ఐ చాణిక్య తెలిపారు. దాడుల్లో పది మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శిబిరం వద్ద ఉన్న 17 ద్విచక్రవాహనాలు, నాలుగు కోడిపుంజులతో పాటు రూ.13,980 నగదును సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
10 మంది పందెంరాయుళ్ల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment