రాష్ట్రానికే ఐకాన్‌గా నిలబడిన అంబేడ్కర్ స్మృతి వనం నేడు వెలవెలబోతోంది. గడ్డి, మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారింది. గత ప్రభుత్వం ఈ ప్రాంగణాన్ని అందమైన మొక్కలతో ఆహ్లాదం పంచేలా గ్రీనరీతో తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. కూటమి ప్రభుత్వం పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిర్వహణ భారం అంటూ ప్రభుత్వం క్రమేణా, దీని బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించి, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రభ మసకబారేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment