పోటెత్తిన భక్తజనం
ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తజనం అమ్మవారి దర్శనానికి తరలిరావటంతో వేకువజాము నుంచే ఉయ్యూరు పట్టణం భక్తజనసంద్రంగా మారింది. డప్పు వాయిద్యాలతో పాలపొంగళ్లు, పొట్టేళ్లు, కోళ్లతో భక్తులు ఊరేగింపుగా తిరునాళ్లకు తరలివచ్చి చల్లని తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అమ్మవారిని దర్శించుకుని పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. విజయవాడ–మచిలీపట్నం ప్రధాన రహదారి, కాటూరురోడ్డు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలతరబడి బారులుతీరారు. అమ్మా వీరమ్మతల్లీ.. చల్లంగ చూడమ్మా.. కాపాడమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు.
వైభవంగా వీరమ్మతల్లి
తిరునాళ్ల మహోత్సవం
పోటెత్తిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment