కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
ఉయ్యూరు: రైతులు పండించే కూరగాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ విజయ సునీత అన్నారు. మండలంలోని చిన ఓగిరాల గ్రామంలో క్యాబేజీ, వంగ తోటలను ఆదివారం ఆమె సందర్శించారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో క్యాబేజీ, వంగ, ఇతర కూరగాయల ధరలు తగ్గటంతో క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విజయ సునీత మాట్లాడుతూ స్థానికంగా రైతులు పండించే కూరగాయలు నేరుగా రైతుబజారులో అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. రైతులు సంఘంగా, గ్రూపుగా, వ్యక్తిగతంగా రైతుబజారు ఎస్టేట్ అధికారిని కలిసి ఉత్పత్తులను అమ్ముకుని గిట్టుబాటు ధర పొందొచ్చన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్యాబేజీ, వంగ వంటి కూరగాయలు తాత్కాలికంగా నిలిపివేయాలని రైతులు కోరారు. రైతుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సునీత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment