గన్నవరం: స్థానిక పశువైద్య కళాశాల విద్యార్థులు ఉపకార వేతనాలు పెంపు కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 14వ రోజుకు చేరుకున్నాయి. పలువురు పశువైద్య విద్యార్థులు దీక్షలో బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెడికల్, డెంటల్, ఆయుష్ విద్యార్థులకు నెలకు రూ. 23వేల నుంచి రూ. 26 వేలు స్టైఫండ్ చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం రూ. 7 వేలు ఇవ్వడం అన్యాయమన్నారు. స్టైఫండ్ పెంపు కోసం గత పదమూడేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన వైద్య విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment