24 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ఆది దంపతులకు మంగళ స్నానాలతో ప్రారంభమై, మండపారాధనలు, కల్యాణోత్సవం, రథోత్సవం, పూర్ణాహుతితో ముగుస్తాయి. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో పవళింపు సేవ జరుగుతుంది.
ఆదిదంపతులకు మంగళ స్నానాలు..
మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా 24వ తేదీ ఉదయం 9 గంటలకు గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరుల అలంకరణ జరుగుతుంది. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 25వ తేదీ మండపారాధనలు, కలశారాధన, మూల మంత్ర హవనం, బలిహరణ జరుగుతుంది.
త్రికాల అభిషేకాలు, కల్యాణోత్సవం..
26వ తేదీ సాయంత్రం మల్లేశ్వర స్వామి వార్లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు త్రికాల అభిషేకాలు, రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోద్భవ కాలాభిషేకం, రాత్రి గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సదస్యం, సాయంత్రం నాలుగు గంటలకు కెనాల్‌రోడ్డులో రథోత్సవం జరుగుతుంది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, దుర్గాఘాట్‌లో అవభృతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
మార్చి 1 నుంచి ద్వాదశ ప్రదక్షిణలు..
ఉత్సవాలలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ నిర్వహిస్తారు.
ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల
పాటు నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment