మైలవరం: గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టి.రాజు తెలిపారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మైలవరం–తిరువూరు రోడ్డులో మైలవరం మండల పరిధిలోని హెచ్‌పీసీఎల్ వారి విశాఖ–విజయ వాడ–సికింద్రాబాద్, విజయవాడ–ధర్మపురి పైప్‌లైన్ వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అనుసరించి సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ పైప్‌లైన్ 628 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, మైలవరం నుంచి తిరువూరు వరకు ఉన్న పైప్‌లైన్‌ను పర్యవేక్షించడానికి లైన్‌వాకర్‌ను నియమించామన్నారు. పైప్‌లైన్ మార్గంలో ఎక్కడైన లీక్ అయిన సందర్భంలో లైన్ వాకర్‌కు సమాచారం ఇస్తే ఆయన ద్వారా వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్ స్పందించి లీక్ మరమ్మతు పనులు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment