గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 27న జరిగే ఉమ్మడి కృష్ణా –గుంటూరు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర కీలకమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశమందిరంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ ప్రతి అంశాన్నీ నిశి తంగా పరిశీలించి, సాధారణ పరిశీలకులకు నివేదిక అందించాలన్నారు. ఈసీఐ మార్గదర్శకాలపై శిక్షణ కార్యక్రమాల ద్వారా విధుల నిర్వహణపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా పరిధిలో 112 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని, పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment