పీహెచ్‌సీల్లో డీఎంహెచ్‌ఓ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహా సిని మంగళవారం అర్ధరాత్రి ఎ.కొండూరు, రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రి వేళల్లో విధుల్లో ఉండాల్సిన సిబ్బందిని తనిఖీ చేసి, హాజరు పట్టీ పరిశీలించారు. ఆ కేంద్రంలో అందిస్తున్న సేవల రికార్డులను పరిశీలించారు. ఎ.కొండూరు పీహెచ్‌సీలో కాన్పు జరిగిన బాలింత, శిశువుల ఆరోగ్య పరి స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎన్‌సీడీ–సీడీ సర్వే పరిశీలన
జిల్లాలో జరుగుతున్న ఎన్‌సీడీ– సీడీ సర్వేను డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పరిశీలించారు. కంచికచర్ల–2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సంచార చికిత్స కార్యక్రమం, వసంతకాలనీలో జరుగుతున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేను తనిఖీచేశారు. సర్వే లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ చేరుకుని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్‌లు, వెయిటింగ్ హాల్స్, ప్రయాణికులకు అందుతున్న సదు పాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో అభించే ఆహార పదార్థాలు, వాటి నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 31.37 కోట్లతో జరుగుతున్న పనుల పురో గతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలు అందిందుకు వారి అభిప్రాయాలను సేకరించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సేవలు, రైళ్ల నిర్వహణ, సమయపాలన తదితర విషయాలపై అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో డీఎంహెచ్‌ఓ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment